అమరావతి పై ప్రేమ ఉంటే గాజువాక నుండి ఎందుకు పోటీ చేశారు – అవంతి శ్రీనివాస్

Monday, August 24th, 2020, 10:08:35 PM IST

విపక్షాల పై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు తీరు పై, పవన్ కళ్యాణ్ ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కి రెబల్ గా మారిన రఘురామ కృష్ణంరాజు, నారా లోకేష్ ల పై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, విజయవాడ, విశాఖ లలో ప్రభుత్వం గెస్ట్ హౌజ్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం అని అన్నారు. ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. చంద్రబాబు హయాంలో లో ఒక్క గెస్ట్ హౌస్ కూడా కట్టలేదు అని, ప్రజల డబ్బు దుర్వినియోగం చేశారు అని ఆరోపించారు.

చంద్రబాబు కి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు అని, అయితే రాష్ట్రం లో వరదలు వచ్చినా, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినా చంద్రబాబు, నారా లోకేష్ కనిపించరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతారో ఆయనకే తెలీదు అని, అమరావతి పై అంత ప్రేమ ఉంటే గాజువాక నుండి ఎందుకు పోటీ చేశారు అంటూ అవంతి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి కాని, అభివృద్ది చేయకూడదా అంటూ సెటైర్స్ వేశారు.గాజువాక ప్రజల ఓట్లు వేయించుకొని విశాఖ పరిపాలన రాజధానిని పవన్ ఎలా వ్యతిరేకిస్తారు అని తెలిపారు. తొట్లకొండ ఎక్కడుందో తెలీకుండా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్నారు అని, దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.