బీజేపీ నాయకులు రథయాత్ర దేనికోసం చేస్తున్నారు

Tuesday, January 19th, 2021, 07:23:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో దేవాలయాల విగ్రహాల ద్వంసాల విషయం లో బీజేపీ నేతలు ఒక నిర్ణయం కి వచ్చి రథయాత్ర కి పిలుపు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ నేతల పట్ల వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే లు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు దేని కోసం రథయాత్ర చేస్తున్నారు అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. అయితే రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చారా అంటూ బీజేపీ ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉండగా ప్రభుత్వం లో భాగస్వామి ఉన్నప్పుడు విజయవాడ లో విగ్రహాలు, ఆలయాలు పడగొడితే అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రంలో రెండు రకాల బీజేపీ నాయకులు ఉన్నారు అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఒకరు అసలైన బీజేపీ నాయకులు అని, మరొకరు చంద్రబాబు పంపిన నాయకులు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గుర్తించాలి అని సూచించారు. రథయాత్ర ప్రారంభించే ముందు ఆలోచించాలి అని, మేనిఫెస్టో లో పెట్టిన అంశాల పై ఆత్మ విమర్శ చేసుకోవాలి అంటూ మంత్రి సూచించారు. అంతర్వేది ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినా, ఇంకా ప్రారంభం కాలేదు అని అన్నారు. అయితే కేంద్రం పై ఒత్తిడి తీసుకు వచ్చి, రాష్ట్రాభివృద్ధి పలు కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ కి లేదా అంటూ చెప్పుకొచ్చారు.