హిందూస్తాన్ షిప్ యార్డ్ మృతుల కుటుంబాలకు భారీ నష్ట పరిహారం – మంత్రి అవంతి శ్రీనివాస్

Sunday, August 2nd, 2020, 07:02:42 PM IST

హిందూస్తాన్ షిప్ యార్డ్ లో నిన్న జరిగిన ప్రమాదం మరొకసారి ప్రజలను ఆందోళనకు గురి చేసింది. క్రేన్ కూలి 11 మంది మృతి చెందగా, మరి కొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే కొత్తగా కొన్న క్రేన్ ను తనిఖీ చేస్తున్న చేస్తున్న సందర్భం లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదం లో మృతి చెందిన వారికి 50 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. యాజమాన్యం తో జరిగిన చర్చల్లో నష్ట పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరణించిన వారి కుటుంబ సభ్యులకి నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు.

అయితే ఈ ప్రమాదం లో మరణించన వారి కుటుంబీకులకు ఒకరికి కాంట్రాక్ట్ సంస్థలో శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అయితే ఉద్యోగాలతో పాటుగా అదనపు ప్రయోజనాలు కూడా కల్పిస్తాం అని వ్యాఖ్యానించారు.