ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి సోకిన కరోనా

Tuesday, September 15th, 2020, 02:15:54 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తున్న కొద్ది భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కి కరోనా వైరస్ సోకింది. ఆయన కార్యాలయం ఒక ప్రకటన లో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటుగా ఆయన కుమారుడు వెంకట శివసాయి నందీశ్ కి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.

అయితే కరోనా వైరస్ సోకడం తో హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. తమని కలిసేందుకు సందర్శకులు ఎవరూ కూడా కార్యాలయానికి రావొద్దు అని మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే కార్యాలయ సిబ్బంది మాత్రం ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటారు అని, ఏదైనా సమస్య వచ్చినా వారిని సంప్రదించాల్సిందిగా సూచించడం జరిగింది. అయితే ఇప్పటికే కరోనా వైరస్ కేసుల పెరుగుదల తో భారత్ దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ లకు కరోనా వైరస్ సోకగా, తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కి సోకడం ప్రజలను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.