చంద్రబాబు లాగా కేవలం ఫోటోలకు ఫోజులిచ్చే సీఎం కాదు – ఏపీ మంత్రి

Friday, October 16th, 2020, 07:26:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు గానే అప్రమత్తం కావడం తో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు అని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అయితే వర్షాల కారణంగా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది అని, అన్ని రకాల చర్యలు తీసుకుంటే చంద్రబాబు లేని పోని విమర్శలు చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే చంద్రబాబు లాగా ఫోటోలకు ఫోజులిచ్చే సీఎం జగన్ మోహన్ రెడ్డి కాదు అని, నష్టం జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో సహాయం చేసే మనస్తత్వం జగన్ ది అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

చంద్రబాబు లా పబ్లిసిటీ కోరుకొనే వ్యక్తి కాదు అని,జూమ్ మీటింగ్ లు మానుకొని చంద్రబాబు రాష్ట్రానికి రావాలి అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కురిసిన భారీ వర్షాల కారణంగా 5795 హెక్టర్ లలో పంట నష్టం జరిగింది అని మంత్రి వ్యాఖ్యానించారు. నష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుల జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పెడతామని, ఎవరి పేర్లు అయినా లేకపోతే నమోదు కి అవకాశం కల్పిస్తాం అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.