అవాంఛనీయ ఘటనలు చేయించడం చంద్రబాబు కి అలవాటైంది

Thursday, January 21st, 2021, 07:40:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై అధికార పార్టీ కి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యం గా దేవాలయాల విగ్రహాల ధ్వంసాల విషయం పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహ రాజకీయాలతో ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు తనకు తానే సమాది కట్టుకుంటున్నాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే సంతబొమ్మాళి గుడి లో నందీశ్వరుడు విగ్రహాన్ని రోడ్డుపై కి తెచ్చిన ఘటన వెనుక టీడీపీ హస్తం ఉందని, ఆ ఉదంతం మొత్తం సీసీ కెమెరా లో రికార్డ్ అయింది అంటూ చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు కి సంబంధించిన మనుషులు ఉన్నారు అంటూ మంత్రి అన్నారు. ఈ ఘటనల్లో ఒక ఎల్లో మీడియా కి చెందిన పాత్రికేయుడు కూడా ఉన్నాడు అని, ఇది చాలా దారుణం అంటూ చెప్పుకొచ్చారు.అయితే చంద్రబాబు నుండే వీళ్లకు ఆదేశాలు వెళ్ళాయి అని, ఇప్పటి వరకు 22 మంది పై కేసులు పెట్టిన విషయాన్ని వెల్లడించారు. అయితే సీఎం జగన్ గురువారం నాడు నిత్యావసరాలను పేదవాడి ఇంటికి చేరవేసే పతాకాన్ని ప్రారంభిస్తున్నారు అని, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు, రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు చేయించడం చంద్రబాబు నాయుడు కి అలవాటు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.