ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగితే రాష్ట్రానికి ప్రమాదం

Friday, January 22nd, 2021, 07:40:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆలయాల్లో విగ్రహాల ధ్వంసాల పట్ల అధికార పార్టీ వైసీపీ సీరియస్ గా వ్యవహరిస్తోంది. అయితే సంతబొమ్మాళి ఆలయంలో నంది విగ్రహం ను తొలగించింది టీడీపీ కి చెందిన వారే అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసానికి తమ పార్టీ వారే అని తెలిసి సిగ్గు పడాల్సింది పోయి, తప్పు చేసిన వారినీ వెనకేసుకొని వస్తావా అంటూ చంద్రబాబు నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విగ్రహాన్ని తొలగిస్తే తప్పేంటి అని ప్రశ్నించిన వారి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దేవతా విగ్రహాలను రాళ్లనుకుంటున్నారా అని సూటిగా ప్రశ్నించారు.విగ్రహాలను తాము దేవుని రూపాలుగా భావించి పూజిస్తాము అని, ఏ ఎండకి ఆ గొడుగు పట్టే చంద్రబాబు అసలు హిందువేనా అంటూ మండిపడ్డారు. అయితే ఇది పద్దతి కాదు అని బాబుకి చెప్పేవారే లేరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే భ్రమలో బాబు ఉన్నారు అని, వెంటనే ఆయన్ని మానసిక వైద్యుని కి చూపించాలని, రాజకీయాలకు బాబు అనర్హుడు అని,ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగితే రాష్ట్రానికి ఎంతో ప్రమాదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.