ఈ ఏడాది పంటలకు సమృద్దిగా నీరు అందిస్తాం – మంత్రి అనిల్

Monday, August 24th, 2020, 07:50:23 PM IST

AP-Minister-Anil-Kumar

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరొకసారి సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం తో పంటలకు కూడా సమృద్ది గా నీరు అందిస్తాం అని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి జలాశయాలకు నిండుదనం వచ్చింది అని అన్నారు. రాష్ట్రంలోని జలాశయాలను పూర్తి స్థాయి సామర్ధ్యం తో నింపుతాం అని తెలిపారు. గతంలో వైయస్సార్ హయాంలో భారీగా వర్షాలు కురిశాయి అని, మళ్లీ జగన్ పాలన లోనే జలాశయాలకు నిండుదనం వచ్చింది అని అన్నారు.

సోమశిల చరిత్రలో గత ఏడాది మొదటిసారిగా పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీల మేర నీటిని నింపాం అని, ఈ ఏడాది కూడా నింపుతాం అని తెలిపారు. అయితే కండలేరు జలాశయానిక కూడా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తామని అన్నారు. ఈ ఏడాది పంటలకు సమృద్దిగా నీరు అందిస్తాం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం లో వెల్లడించారు.