కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?

Monday, October 26th, 2020, 01:50:18 PM IST

పోలవరం ప్రాజెక్టు అంశం పై నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ను నిర్లక్ష్యం చేసింది ఎవరో, పరుగులు పెట్టిస్తుంది ఎవరో ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. 2014 లో అధికారంలో కి వచ్చిన తెలుగు దేశం పార్టీ రెండు సంవత్సరాల పాటు పోలవరం ను పట్టించుకోలేదు అని ఆరోపించారు. అయితే 2016 లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ను టీడీపీ స్వాగతించింది అని తెలిపారు. అయితే ఈ ప్యాకేజీ మేరకు పోలవరం ను ఇందులోకి తీసుకు వచ్చింది అని, చంద్రబాబు అభ్యర్థన మేరకు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం కె అప్పజెప్పిన విషయాన్ని వెల్లడించారు. అయితే ప్యాకేజీల కోసమే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే 2014 లో సవరించిన అంచనాలతో నిధులు విడుదల చేయాలని బాబు కోరిన విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించారు మంత్రి అనిల్ కుమార్.

అయితే 2014 ఎల్ సవరించిన అంచనాలతో చెల్లించలేమని 2017 లో కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది అని మంత్రి పేర్కొన్నారు. ఆనాడు టీడీపీ మంత్రులు కూడా ఉన్నారు అని, ఆనాడు టీడీపీ మంత్రులు ఆ నిర్ణయం ను వ్యతిరేకించలేదు అని తెలిపారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాల కారణంగా నేడు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది అని టీడీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు టీడీపీ సిగ్గులేకుండా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తుంది అని, కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకున్నారు అంటూ మంత్రి నిలదీశారు. అంతేకాక ప్రతి సోమవారం పోలవరం లో చంద్రబాబు నాయుడు ఏం పరిశీలించారు అని సూటిగా ప్రశ్నించారు అనిల్ కుమార్. అయితే ఈ మొత్తం వ్యవహారం పై సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాస్తారు అని మంత్రి స్పష్టం చేశారు.