అధికారులకి మంత్రి అనిల్ కుమార్ కీలక సూచనలు!

Sunday, September 27th, 2020, 08:46:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీ వర్షాల కురవడం చేత ఈ ఏడాది నదుల్లో భారీగా వరద నీరు చేరింది. అయితే కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక సూచనలు చేశారు. అయితే అందుకోసం అనిల్ కుమార్ యాదవ్ కృష్ణా మరి గుంటూరు జిల్లా లకి చెందిన కలెక్టర్లు మరియు మున్సిపల్ అధికారులతో ఫోన్ లో మాట్లాడటం జరిగింది.

అయితే భారీ వరదల కారణంగా ప్రకాశం బ్యారేజి కి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉంది అని, అందుకోసం అధికారులు ముందుగా అప్రమత్తంగా ఉండాలి అని అనిల్ కుమార్ అన్నారు. అంతేకాక లోతట్టు మరియు దిగువ ప్రాంతాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేయడం మాత్రమే కాకుండా వారికి అవసరమైన పునరావాస చర్యలను తీసుకోవాలి అని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఇతర జిల్లా అధికారులకు, కలెక్టర్ లకు అనిల్ కుమార్ యాదవ్ సూచించడం మాత్రమే కాకుండా, ప్రజల ను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులకు సూచనలు చేయడంతో ప్రజలను సకాలం లో సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది.