ఆయన ఓ చవట, దద్దమ్మ, సన్నాసి – మంత్రి అనిల్ కుమార్

Thursday, March 11th, 2021, 05:19:38 PM IST

పోలవరం ప్రాజెక్టు విషయం లో అధికార పార్టీ వైసీపీ కి, ప్రతి పక్ష పార్టీ టీడీపీ కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే తాజాగా మాజి మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యల కి వైసీపీ కీలక నేత, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేవినేని ఉమా మరొకసారి తన కులం గురించి మాట్లాడితే సహించేది లేదు అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. ఆడ మగ కానీ ఉమా, సోడాలుకొట్టుకొనే బ్రతుకు నీది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఆయన ఓ చవట, దద్దమ్మ, సన్నాసి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే పోలవరం నిర్మాణం విషయం లో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు నిర్మించారో రామోజీరావు కి తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తెలుగు దేశం పార్టీ హయాంలో జరిగిన దాని కి మాపై నిందలా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.పోలవరం లో టీడీపీ చేసిన పాపాలను మేము కడుగుతున్నాం అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.