చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తిప్పి కొడతాం – మంత్రి అనిల్ కుమార్

Monday, September 7th, 2020, 10:16:39 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై మరొకసారి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ప్రచారం చేయడం లో దిట్ట అని ఆరోపించారు. గండికోట ప్రాజెక్ట్ విషయం లో చంద్రబాబు నాయుడు తీరు పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు అప్పుడు ప్యాకేజీ ఇవ్వకపోవడం వలన 26టీఎంసీ ల నీటిని నిల్వ చేయలేని పరిస్తితి ఉంది అని ఆరోపించారు. అయితే సీఎం జగన్ అధికారం చేపట్టిన అనంతరం ప్రాజెక్టుకి నిధులు ప్రకటించడం మాత్రం కాకుండా, 676 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక ఇంకా మిగిలిన ప్రాజెక్ట్ డబ్బుని సైతం త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు.

అయితే గండికోట ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి అని అన్నారు. సీఎం జగన్ కి మంచి పేరు వస్తుందని కొందరు చంద్రబాబు ను రెచ్చగొడుతున్నారు అని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా తిప్పి కొడతాం అని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు వర్షాలు పడకూడదు అని దేవుడ్ని కోరుకొనే వ్యక్తి అని ఆరోపించారు.సీఎం జగన్ రాయలసీమ కి మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక పోతున్నారు అని అన్నారు. అంతేకాక గతంలో చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయిలు సైతం మేము చెల్లిస్తున్నాం అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.