మహిళలే చంద్రబాబు ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి

Sunday, January 10th, 2021, 08:12:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం నుండి పేద ప్రజల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు. అంతేకాక పేద ప్రజలు కూడా ప్రైవేట్ పాటశాల కి దీటుగా విద్య ను అభ్యసించే విధంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు మీడియా సమావేశం లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ వడి పథకం అమలు చేస్తున్నాం అని తెలిపారు.అయితే తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంక్షేమ పథకాలు అమలు కాకుండా చంద్రబాబు సైంధవుడు లా అడ్డుపడుతున్నారు అని విమర్శించారు. అయితే పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా అడ్డుకున్నారు అని, కొన్ని చోట్ల పేదలకు ఇచ్చే పట్టాలు కూడా అడ్డుకున్నారు అని, ఎవరెన్ని కుట్రలు పన్నినా సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగిస్తారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే మహిళలే చంద్రబాబు ను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి అని అన్నారు. అంతేకాక హైదరాబాద్ కే చంద్రబాబు పూర్తిగా మకాం మార్చుకోవాల్సిన పరిస్థతి వస్తుంది అని సెటైర్స్ వేశారు. అంతేకాక కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లోనే ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు కి డిపాజిట్లు దక్కవు అని, తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు కి ఘోర ఓటమి తప్పదు అంటూ విమర్శించారు.