ఆ మహకార్యాన్ని ఏ చంద్రబాబు కూడా ఆపలేడు – మంత్రి అనిల్

Thursday, December 10th, 2020, 04:02:49 PM IST

గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ళ స్థలాల పంపిణీ పై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. అయితే ఈ నెల 25 న పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి తీరుతాం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 25 న క్రిస్మస్ తో పాటుగా ముక్కోటి ఏకాదశి కూడా ఉందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అయితే రెండు పండుగలు ఓకే రోజు వచ్చిన కారణం చేత ఆ రోజే ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తాం అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఆ మహాకార్యాన్ని ఏ చంద్రబాబు కూడా ఆపలేడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇది మాత్రమే కాకుండా తన పై వస్తున్న పుకార్ల పై మంత్రి స్పందించారు. నా మీద కట్టుకథలు రాస్తున్న ఆంధ్ర జ్యోతి పేపర్ కి నేను భయపడను అని, కావాలంటే 365 రోజులు రాసుకోండి ఐ డోంట్ కేర్ అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇళ్ళ స్థలాల పంపిణీ విషయం లో టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపద్యం లో మరొకసారి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.