పోలవరం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు కి లేదు

Monday, November 16th, 2020, 07:24:50 AM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయం లో ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తుంది అని మంత్రి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు తుడుచుకోవడానికి కూడా ఆ పేపర్ పనికి రాదు అని, దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకొని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్టున్నారు అని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో కూర్చొని కారు కూతలు కూయోద్దు అని ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే పోలవరం ఎత్తు తగ్గించారు అని బాబు కి ఎవరు చెప్పారు అంటూ సూటిగా ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం లో ఎటువంటి మార్పులు ఉండవు అని స్పష్టం చేశారు. నిర్మాణం అంతా కూడా కొత్త షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది అని, పోలవరం ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు కి కొత్త బట్టలు పంపిస్తాం అని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వచ్చి పోలవరం ఎత్తు కొలుచుకోవచ్చు అని అన్నారు. చంద్రబాబు నాయుడు 2017 లో కేబినెట్ లో ఏ ఒప్పందం చేసుకున్నారో చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. కేబినెట్ నోట్ చదవాలి అని డిమాండ్ చేశారు. అయితే పోలవరం నిర్వాసితుల గురించి కాకుండా చంద్రబాబు కమిషన్ల కోసం ఆలోచించారు అని ఆరోపించారు. అయితే వైఎస్సార్ ప్రారంభించిన పోలవరాన్ని వైఎస్ జగన్ పూర్తి చేస్తారు అని మంత్రి వ్యాఖ్యానించారు.