చంద్రబాబు పై మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Friday, October 30th, 2020, 01:35:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఇక్కడ జరగవు అని, ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాలి అని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయాలు కుదరవు అని తేల్చి చెప్పారు. అయితే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ది చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ది అని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం తగదు అని, వాస్తవాలను తెలుసుకోవాలి అంటూ సూచించారు. జూమ్ మీటింగ్ లలో ఆరోపణలు చేయడం కాదు అని, స్కూళ్ల అభివృద్ది చూడాలి అని, గ్రామ మరియు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా సేవలు అందజేస్తుందొ తెలుసుకోవాలి అని బాబు కి సూచించారు. అయితే టీడీపీ హయం లో వృద్దులు పింఛన్ల కోసం చెప్పులు అరిగేలా తిరిగే వారు అని, ప్రజా సంక్షేమమే లక్షం గా సీఎం జగన్ పని చేస్తున్నారు అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.