చంద్రబాబు అక్కడే ఉంటానని అనడం సిగ్గు చేటు – మంత్రి అనిల్ కుమార్

Saturday, October 17th, 2020, 04:05:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. అయితే మరొకసారి చంద్రబాబు కరకట్ట నివాసం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం పై మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదలు వచ్చి కరకట్ట మీద ఇళ్లు మునుగుతుంటే, ఖాళీ చేయకుండా చంద్రబాబు అక్కడే ఉంటానని అనడం సిగ్గుచేటు అంటూ మంత్రి ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే బాబు కి ఏడుపు ఆగడం లేదు అని తెలిపారు. కరకట్ట మీద ఉన్న ఇల్లు గురించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు మొండికేస్తూ, ప్రభుత్వం పై చౌకబారు విమర్శలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక చంద్రబాబు ఒక టూరిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టూరిస్ట్ లాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి, సాయంత్రానికి ఫ్లైట్ ఎక్కి పోయే ప్రతి పక్ష నేత అంటూ విమర్శించారు. అటువంటి వ్యక్తికి మాట్లాడే అర్హత కూడా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ల మీద బాబుకి మళ్లీ దొంగ ప్రేమ పుట్టుకొచ్చింది అని, బాబు అధికారంలో ఉంటే బీసీ లు బిజినెస్ క్లాస్ అని, ప్రతి పక్షం లో ఉంటే బ్యాక్వార్డ్ క్లాస్ అంటారు అని, అయితే చంద్రబాబు కి దమ్ముంటే బీసీ లకు ఏం చేశాడో లెక్క తీయాలి అని అన్నారు. అయితే సీఎం జగన్ మాత్రం వరుస సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు అని ప్రశంసలు కురిపించారు.