ఏపీ ప్రభుత్వం తరుపున బాలు అంత్యక్రియలకు హాజరైన మంత్రి అనిల్..!

Saturday, September 26th, 2020, 12:52:02 PM IST

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే నిన్న బాలు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అయితే నిన్న ఆసుపత్రి నుంచి బాలు మృతదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు.

అయితే బాలుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు అబిమానులు వేలాదిగా అక్కడకు వస్తుండడంతో కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఇంటి నుంచి ఆయన పార్థివదేహాన్ని తామరైపాక్కంలో ఉన్న ఫాంహౌస్ కు తరలించారు. అయితే కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల మధ్య పరిమిత సంఖ్యలో బాలు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. అయితే బాలు అంత్యక్రియలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు. బాలు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో బాలు స్మృత్యర్థం ఏదైనా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని, ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.