తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో చరిత్ర సృష్టిస్తాం – మంత్రి అనిల్ కుమార్

Monday, March 22nd, 2021, 07:28:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక అన్ని పార్టీ లకు కీలకం కానుంది. ఇప్పటికే ప్రతి పక్ష పార్టీలు అయిన తెలుగు దేశం పార్టీ, బీజేపీ, జన సేన లు ఇందుకోసం తీవ్ర కృషి చేస్తున్నాయి. పంచాయతీ మరియు మునిసిపల్ ఎన్నికలతో సత్తా చాటిన వైసీపీ ఈ ఉప ఎన్నిక పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ అంశం పై జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో చరిత్ర సృష్టిస్తాం అని వ్యాఖ్యానించారు. అయితే సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలన పై ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే తమ 20 నెలల పాలన కు పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలే రెఫరెండం గా భావిస్తాం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అంతేకాక ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు పై మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సిఐడి పెట్టిన కేసుకు గానూ చంద్రబాబు కు స్టే ఇచ్చింది హైకోర్ట్. అయితే ఈ వ్యవహారం పై మంత్రి అనిల్ సెటైర్స్ వేశారు. చంద్రబాబు జీవితం అంతా స్టే ల బతుకే అని విమర్శించారు. తప్పులు చేయకపోతే కోర్టుల్లో స్టే తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే బాబుకి చిత్తశుద్ది ఉంటే ధైర్యం గా విచారణ ను ఎదుర్కొనే వారని, అలాంటి సామర్థ్యం లేనందునే స్టే ల బాబు గా మారాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అధికార పార్టీ కి చెందిన పలువురు నేతలు, మంత్రులు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.