ఆ ఆసుపత్రుల పై కఠిన చర్యలు తీసుకుంటాం – ఆళ్ళ నాని

Tuesday, September 8th, 2020, 03:00:47 AM IST

Alla-Nani
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతిన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహమ్మారిని అరికట్టడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆరోగ్య శ్రీ పథకం కింద కరోనా వైరస్ కి చికిత్స అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చికిత్స విషయం లో జరుగుతున్న పలు సంఘటనల పై మంత్రి ఆళ్ళ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆరోగ్య శ్రీ ను నీరు గార్చే ఆసుపత్రుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఆసుపత్రి లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలి అని, ఎక్కడైనా తప్పులు జరిగితే ఆరోగ్య మిత్ర లు వెంటనే సమాచారం ఇవ్వాలి అని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహమ్మారి ను అరికట్టడానికి 10.18 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆళ్ళ నాని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.