వాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి – ఆళ్ళ నాని

Tuesday, March 23rd, 2021, 04:10:43 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భారీగా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పట్ల అంతటా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజి లో భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని స్పందించారు. తిరుమల జూనియర్ కాలేజి లోని 163 మంది కరోనా వైరస్ సోకిన విద్యార్థులకు ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించామని అన్నారు. జిల్లా అధికారులతో మంత్రి ఆళ్ళ నాని మాట్లాడారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి నివారణ కొరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల జూనియర్ కాలేజి ను పూర్తి గా శానిటైజ్ చేయాలని ఆదేశాలను జారీ చేశారు.కాలేజి లోని మిగతా విద్యార్థులకు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని, అన్ని విద్యా సంస్థల్లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక ప్రజలు అందరు కూడా వాక్సిన్ తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి అంటూ చెప్పుకొచ్చారు.