అర్హులైన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలి – ఆళ్ళ నాని

Friday, August 14th, 2020, 02:09:38 AM IST


కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి ప్లాస్మా ఆయుధం లాగా పని చేస్తుంది అని చెప్పాలి. అయితే ఈ ప్లాస్మా థెరపీ పై ఎటువంటి అపోహలు వద్దు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు. కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు, అర్హులు అయిన వారు అంతా కూడా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలి అని ఆళ్ళ నాని అన్నారు. అయితే ఈ ప్లాస్మా ను దానం చేసిన వారికి ప్రోత్సాహకం గా 5 వేల రూపాయలు కూడా ఇస్తామని మంత్రి ఆళ్ళ నాని అన్నారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రం లో ఆసుపత్రుల్లో సేవలు, సదుపాయాల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని, పరిస్తితి ను ఎప్పటికపుడు సీఎం జగన్ సమీక్షిస్తూ, సూచనలు చేస్తున్నారు అని ఆళ్ళ నాని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొనే ఎక్కువగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ లో రికవరీ రేటు అధికంగానే ఉంది అని, నెలకు కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది అని అన్నారు.