కర్నూల్ జిల్లాలో కొత్తగా 11 కోవిడ్ ఆసుపత్రులు సిద్దం – మంత్రి ఆళ్ళ నాని

Monday, April 19th, 2021, 07:29:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో కొత్తగా 11 కోవిడ్ ఆసుపత్రులను సిద్దం చేసినట్లు మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. అయితే ఆదోని కస్తూరి భా గాంధీ స్కూల్ లో 53 మంది విద్యార్థులకి కరోనా వైరస్ సోకిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం పట్ల మంత్రి ఆళ్ళ నాని అవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేయడం మాత్రమే కాకుండా, డీహెచ్ఎంఓ అధికారి తో మంత్రి ఆళ్ళ నాని ఫోన్ లో మాట్లాడారు.

అయితే ఆదోని కస్తూరి బా గాంధీ స్కూల్ లో కరోనా వైరస్ మహమ్మారి పరీక్షల కొరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే అందులో ఎవరికైనా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అయితే ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ మహమ్మారి ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని వ్యాఖ్యానించారు.