బిగ్ న్యూస్: ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్..!

Monday, August 24th, 2020, 04:40:51 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్య జనాలతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా కరోనా కలవరపెడుతుంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. అయితే కరోనా బారిన పడకుండా ఉండేందుకు నేతలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో కరోనా బారిన పడుతూనే ఉన్నారు.

అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్న ఆదిమూలపు సురేశ్‌కు కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు గత వారం రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.