అవినీతి రహిత పాలన ను ఈ ప్రభుత్వం అందిస్తోంది – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Thursday, October 1st, 2020, 04:53:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గ్రామ సచివాలయ వ్యవస్థ ను ప్రారంభించి శుక్రవారం తో ఏడాది పూర్తి అవుతుంది అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్క ఇంటి ముందుకు ప్రభుత్వ పాలన తీసుకొని వెళ్ళడానికి ఈ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అవినీతి కి చోటు లేకుండా 543 సేవలను ఈ రోజు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలను అందిస్తున్నాం అని తెలిపారు.

అయితే అవినీతి రహిత పాలన ను ఈ ప్రభుత్వం అందిస్తోంది అని మంత్రి వ్యాఖ్యానించారు. సచివాలయం పని తీరును మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు అని తెలిపారు. కేంద్ర కేబినెట్ సెక్రెటరీ కూడా సచివాలయ వ్యవస్థను అభినందించిన విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల పై చిలుకు ఉద్యోగాలను ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిది అని మంత్రి కొనియాడారు. అంతేకాక రేపు గ్రామ సచివాలయం ఉద్యోగులను అభినందించేందుకు సాయంత్రము 7 గంటలకు అందరూ బయటికి వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలి అని కోరారు.