మొదటిరోజు దాదాపు 80 శాతం విద్యార్థులు హజరు అయ్యారు – ఏపీ విద్యాశాఖ మంత్రి

Monday, November 2nd, 2020, 05:26:49 PM IST


కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ఏడు నెలలు పాటశాలలు, కళాశాలలు ముతబడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నేడు పాటశాల లు, కళాశాలలు పునః ప్రారంభం అయ్యాయి. అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణం గా పూర్తి స్థాయిలో విద్యార్థులు హజరు కాలేదు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు హజరు అయినట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

అయితే విద్యార్థులు ఎంతో ఉత్సాహం గా పాటశాల లకు వస్తున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాటశాల లను పూర్తి గా అభివృద్ది చేసినట్లు వివరించారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఇచ్చిన విషయాన్ని తెలిపారు. అన్ని వసతులు వారికి అందుబాటులో కి వచ్చాయి అని,తల్లిదండ్రులు మరియు విద్యార్థుల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రైవేట్ పాటశాల లు, కళాశాల లు 70 శాతం మాత్రమే ఫీజు తీసుకోవాలని సూచించిన విషయాన్ని వెల్లడించారు. ఎవరైనా ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని, ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్న విషయాన్ని మంత్రి వెల్లడించారు.