స్థానిక ఎన్నికలు నవంబర్ లో నిర్వహించే పరిస్థతి లేదు – ఏపీ మంత్రి

Friday, October 23rd, 2020, 03:30:17 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్ నెలలో నిర్వహించే పరిస్థితి లేదు అని మంత్రి గౌతం రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినా వచ్చే అవకాశం ఉంది అని మంత్రి తేల్చి చెప్పారు. అయితే నవంబర్ నెలలో ఇంకా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పిన విషయాన్ని వెల్లడించారు. అయితే బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగి ఎన్నికలు తప్పనిసరి అని, అయితే మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకి కాస్త వెసులుబాటు ఉంది మంత్రి మంత్రి వ్యాఖ్యానించారు. అందుచేత ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్తితి లేదు అని తెలిపారు.