2002 నుండి ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయితీ వస్తోంది

Thursday, January 28th, 2021, 03:15:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో అటు అధికార పార్టీ నేతలు, ప్రతి పక్ష పార్టీ నేతలు సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ మేరకు ఏకగ్రీవాల పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం పై అధికార పార్టీ కి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

కోర్టు ఉత్తర్వులు రాగానే ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు అంటూ మంత్రి నిమ్మగడ్డ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అనుచరుడి గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు అని, కరోనా ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను గౌరవించాం అని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే 2002 నుండి ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయితీ వస్తోంది అంటూ మంత్రి మరొకసారి అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడకుండా 19ఏ చట్టం తీసుకొచ్చాం అంటూ మంత్రి గురువారం నాడు మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.