జగన్ పథకాలను ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయి – ఏపీ మంత్రి

Thursday, October 22nd, 2020, 03:20:47 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పట్టిన పథకాల పై ఇతర రాష్ట్రాలు సైతం చూస్తున్నాయి అని మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే వైఎస్సార్ ఉచిత విద్యుత్ పేరిట ప్రవేశ పెట్టిన పథకం పై జిల్లా స్థాయి సమావేశం లో పేర్ని నాని తో సహ పలువురు ఎమ్మెల్యే లు, నేతలు పాల్గొన్నారు. అయితే కేంద్ర విద్యుత్ సంస్కరణ లో బాగంగా ప్రతి ఒక్క రైతుకు మీటర్ కనెక్షన్ వినియోగిస్తున్నాం అని తెలిపారు.

అయితే రైతుకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం అని మంత్రి ఈ సమావేశం లో తెలిపారు. ప్రతి నెలా కూడా రైతులు వాడిన విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే అందు కొరకే ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉండగా, పక్క రాష్ట్రాల పథకాలను కాపీ కొట్టింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పథకాలను ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయి అని మంత్రి వ్యాఖ్యానించారు.