జగన్ పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఎన్ రోలింగ్

Wednesday, October 7th, 2020, 09:45:15 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలు పూర్తి స్థాయిలో విజయం సాధిస్తున్నాయి. సీఎం జగన్ పాలనా విధానం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే జగనన్న విద్యా కానుక పథకం ఈ నెల 8 న ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం తో దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందనున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న పథకాల పై మంత్రి ఆదిమూలపు సురేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ లను అందజేస్తాం అని తెలిపారు. కరోనా వైరస్ కారణం గా ఈ పథకం వాయిదా పడుతూ వచ్చింది అని తెలిపారు. అన్ని జాగ్రత్త చర్యలతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు అని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాల వలన పాఠశాలల్లో ఎన్ రోలింగ్ పెరిగింది అని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం, అమ్మ వడి లాంటి పలు పథకాల తో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అని తెలిపారు.