అమెరికా ఎన్నికలలో గెలుపొందిన ఏపీకి చెందిన వ్యక్తి..!

Friday, November 6th, 2020, 04:42:34 PM IST

అమెరికా ఎన్నికలలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి విజయం సాధించారు. నెల్లూరు జిల్లా విడవలూరులో సామాన్య గిరిజన కుటుంబంలో జన్మించిన ఏడుకొండలు కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో కౌన్సిల్‌గా గెలుపొందారు. సామాన్య గిరిజన కుటుంబంలో జన్మించిన ఏడుకొండలు అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఇంటర్ వరకు సొంతూరులోనే చదివిన ఏడుకొండలు . ఆ తర్వాత ఎస్వీ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌ చదివాడు. అనంతరం యూనివర్శిటీలో కో-ఆపరేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత సివిల్స్ రాసి ఐఈఎస్ అధికారిగా ఎంపికై కొద్ది రోజులు ఇండియాలోనే పనిచేశాడు. సింగపూర్‌లో కొన్నాళ్ళ పాటు ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ సిటీలో ఉంటూ అవుతార్ ఐటీ సొల్యూషన్ స్థాపించి దానికి సీఈవోగా ఉన్నారు. అయితే సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉండే ఏడుకొండలు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 వందల మంది గిరిజన విద్యార్థులను చదివిస్తున్నారు. అంతేకాదు సొంతూరు విడవలూరులోనూ పాఠశాలను అభివృద్ధికి చేసేందుకు తన వంతు సహాయం అందించాడు.