ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్..!

Tuesday, September 1st, 2020, 12:40:13 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

అయితే తాజాగా శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన కాస్త అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్లు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే షరీఫ్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు కోరుకుంటున్నారు.