కాల్ మనీ పై కస్సు బస్సు లాడుతున్న నేతలు

Sunday, December 13th, 2015, 11:26:20 PM IST


రాష్ట్రంలో సంచలనం రేపుతున్న కాల్ మనీ కేసు కొందరు బడా నేతల గుండెల్లో కలవరం రేపుతోంది. ఇప్పటికే దీని వెనుక ఉన్న కొందరు నేతల పేర్లు కూడా భయటకు వచ్చాయి. అవసరం కోసం అప్పులివ్వటం అసలుకు రెండింతలు మూడింతలు వద్దీగా వసూలు చేయటం, వడ్డీ చెల్లించకపోతే అప్పు తీసుకున్నవారి తాలూకూ ఆడవాళ్ళని బెదిరించి వ్యబిచార కూపంలోకి లాగటం వాణి అకృత్యాలు ఎన్నో ఏ కేసులో వెలుగు చూశాయి.

ఈ వ్యవహారం భయటపడ్డప్పటి నుండి నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవటం తప్ప కేసులో ప్రధాన నిందితులైన వెనుగళ్ల శ్రీకాంత్, సత్యానంద్, చెన్నుపాటి శ్రీను వంటి వారిని పట్టుకోవటంలో అలసత్వం చూపారు. దాంతో నిందితుల్లో వెనుగళ్ల శ్రీకాంత్ ఇప్పటికే దేశం విడిచి బ్యాంకాక్ పారిపోయినట్లు సమాచారం. దీంతో ఎట్టకేలకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ నిందితులను ఎవరినీ వదిలేది లేదని.. అందరినీ ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని అన్నారు. మరో వైపు ప్రతి పక్షాలు అదికార పక్షం పై విమర్శలు గుప్పిస్తున్నారు.