కరోనా పరీక్షల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం!

Thursday, August 20th, 2020, 12:52:36 AM IST


ప్రపంచ దేశాలను భయ భ్రాంతులకి గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో నూ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే భారత్ లో ఎక్కువగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము మాత్రం కరోనా వైరస్ పరీక్షలను చాలా ఎక్కువగా చేస్తూ దేశం లోనే ప్రథమ స్థానం లో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు 5.65 శాతం ప్రజలకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించింది. ఒక మిలియన్ జనాభా కి 56,541 కరోనా టెస్టుల ను చేస్తూ ఏపీ ముందజ లో ఉంది.

అయితే ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 30,19,296 కరోనా టెస్టులు జరిగినట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఎక్కువగా చేయడం కారణం చేత ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,685 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరపగా, అందులో 9,742 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఏపీ లో కరోనా వైరస్ రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది.