ఏపీ ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

Wednesday, November 4th, 2020, 02:07:38 AM IST

ఏపీ ఇంటర్ బోర్డు 2020-21కి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 127 రోజులు పనిచేయబోతున్నాయని, ఏప్రిల్ 24 వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి చివరి వారంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది.

ఇకపోతే జూన్ చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, జూన్ 1 నుంచి 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమతుందని స్పష్టం చేసింది. ఇక ఈ అకడమిక్ ఇయర్‌లో రెండో శనివారం సెలవులు ఉన్నా, టర్మ్ సెలవులు మాత్రం రద్దు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.