టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అల్టీమేట్ కామెంట్స్ చేశారు. రాజధాని ప్రాంతంలోనే నారా లోకేశ్ ఓడిపోయారని సుచరిత వ్యాఖ్యానించారు. అమరావతిలో రెండు, మూడు బిల్డింగులు తప్పా అభివృద్ధి లేదని విమర్శించారు.
అయితే వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ అయ్యారని, హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారని వీటికి కులం రంగు అంటిస్తూ విమర్శలు చేయడం టీడీపీకి తగదని అన్నారు.