ప్రతి పక్షాల విమర్శలు చూస్తుంటే ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి

Saturday, September 12th, 2020, 03:00:30 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయం లోని రథం దగ్ధం అవ్వడం పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఘటన పై త్వరలో నిజాలు నిగ్గు తెలుస్తాం అని వైసీపీ నేత, మెకతోటి సుచరిత అన్నారు. అయితే రథం తగలపడటం వెనుక కుట్ర కోణం దాగి ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు మేక తోటి సుచరిత. ప్రతి పక్షాల విమర్శలు చూస్తుంటే ఆ అనుమానాలు కూడా మరింత బలపడుతున్నాయి అని తెలిపారు.

అయితే కరోనా వైరస్ పోరు లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కీలకం గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారి పై ప్రశంసలు కురిపించారు. వారి కోసం హెల్త్ క్యాంప్ లు పెడుతున్నాం అని, దేశం లోనే తొలిసారిగా పోలీసుల కి వీక్లీ ఆఫ్ లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మాదే అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారు అని, వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.