ఏపీ హైకోర్ట్ కీలక నిర్ణయం.. సీఎం, మంత్రులు, టీడీపీ, బీజేపీలకు నోటీసులు..!

Friday, August 28th, 2020, 01:07:19 AM IST

High_court
ఏపీ రాజధాని అమరావతి తరలింపు విషయంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నేడు ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ముఖ్యమంత్రి జగన్, మంత్రులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు టీడీపీ, బీజేపీలకు కూడా నోటీసులు ఇచ్చింది. రాజధాని తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా చట్టాలు తీసుకొచ్చిందని అమరావతి రైతులు హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు.

అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి, అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. సీఎం జగన్‌తో పాటు మంత్రివర్గం, రాజకీయపార్టీలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. దీంతో ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ, బీజేపీలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.