ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్ట్ కీలక నిర్ణయం.. 16 మందికి నోటీసులు..!

Friday, August 21st, 2020, 04:24:25 PM IST

ఏపీలో గత కొద్ది రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు ఫోన్లను వైసీపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్ట్‌లో పలు పిటీషన్‌లు దాఖలు కాగా నేడు దీనిపై హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

తాజాగా నేడు ఈ కేసులో నేడు 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడికి నోటీసులిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు వీరంతా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజర్ కావాలని ఆదేశాలిచ్చింది. నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని హైకోర్టు సూచించింది.