కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్‌పై ఏపీ హైకోర్ట్ బెంచ్ కీలక నిర్ణయం..!

Friday, March 27th, 2020, 02:00:44 AM IST

దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశమంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే ఈ నేపధ్యంలో ఏపీ హైకోర్ట్ బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్ట్ కింద పనిచేసే అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్, లీగల్ సెల్ అథారిటీ, మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్లు, హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీలు పనిచేయవని హైకోర్ట్ బెంచ్ తెలిపింది. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు వీటి కార్యకలాపాలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.