నిజంగా మతిలేని చర్యే.. ఏపీ సర్కార్‌పై మండిపడ్డ హైకోర్టు..!

Saturday, November 21st, 2020, 07:57:48 AM IST

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. నిరసనలకు సంబంధించి దాఖలైన హెబియస్ కార్పస్ వ్యాజ్యాలపై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం 3 వేల కోట్లు ఖర్చు చేశాక ఇప్పుడు తరలిస్తామనడం నిజంగా ప్రభుత్వ మతిలేని చర్యేనని అని పేర్కొంది. వేల కోట్లు ఖర్చు చేశాక ఎక్కడి పనుల్ని అక్కడే నిలిపేయడం ఏంటని మండిపడింది. అనతేకాదు ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ సొమ్మంతా ప్రజలదే అని పనులు నిలిపేయడంతో అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని వ్యాఖ్యానించింది.

అలాగే రాజధాని ప్రాంతంలో చాలా భవనాలు నిర్మించి ఎక్కడివాటిని అక్కడే వదిలేశారని అభిప్రాయపడింది. ఇప్పటి వరకు ఖర్చు చేసిందంతా ప్రభుత్వానికి, ప్రజలకు జరిగిన నష్టమే అని తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పిటిషనర్‌ తన అఫిడవిట్లో ప్రస్తుత ప్రభుత్వం మతిలేని చర్య అని పేర్కొంటే తప్పేమిటని నిలదీసింది. ప్రజాచైతన్య యాత్రకు విశాఖ వెళ్లిన ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద నోటీసిచ్చి అరెస్ట్‌ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ర్యాలీలు, సమావేశాల సమయంలో భద్రత కల్పించాల్సింది పోలీసులేనని శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందని తెలిపింది.