జగన్ సర్కార్‌కు మరో షాక్ ఇచ్చిన హైకోర్ట్.. ఆ జీవో కొట్టివేత..!

Wednesday, August 12th, 2020, 11:51:48 AM IST

YS_Jagan

ఏపీ సర్కార్‌కి హైకోర్ట్ మరో షాక్ ఇచ్చింది. కరోనా కారణంగా తీవ్ర సంక్షోభమైన పరిస్థితులు ఏర్పడడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేసింది.

అయితే ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్ట్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో సహా 2 నెలల్లోపు చెల్లించాలని ప్రభుత్వానికి సూచించింది.