ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పై హైకోర్టు కీలక ఆదేశాలు

Tuesday, December 29th, 2020, 01:56:25 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వాయిదా వేయడం జరిగింది. అయితే వాటిని నిర్వహించాలి అంటూ ఇటు ఎన్నికల కమిషనర్, ప్రస్తుతం పరిస్తితుల్లో కష్టం అంటూ రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాలను తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.

నేటినుంచి ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలి అని పేర్కొనడం జరిగింది. అంతేకాక ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ను చూపించి రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించ లేం అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, అందుకు సంబంధించిన వివరాలను నిమ్మగడ్డ కి వివరించాలి అని పేర్కొంది. అయితే వారు ఎప్పుడూ ఎలా కలవాలనే విషయం పట్ల హైకోర్టు స్పష్టం చేసింది. ఎక్కడ కలవాలన్న విషయం నిమ్మగడ్డ తెలియజేస్తారు అని స్పష్టం చేసింది. అంతేకాక అప్పటికి కూడా వీరి మధ్య వాదనలు ఒక కొలిక్కి రాకపోతే వాదనలు వింటామ ని స్పష్టం చేసింది.