ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయండి – హై కోర్ట్

Monday, March 8th, 2021, 06:28:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పురపాలక మరియు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపి వేయాలని హై కోర్ట్ ఆదేశాలను జారీ చేసింది. అయితే ఏలూరు పరిదిలోని ఓటర్ల జాబితా కి సంబంధించిన అంశం లో దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల ను ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి ఆదేశాలను జారీ చేసింది.

అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారం లో కూడా హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే వాటి పై విచారణ జరిపింది హైకోర్టు. గతేడాది నామినేషన్ల ప్రక్రియ లో బలవంతపు ఉపసంహరణలు, బెదిరింపులు జరిగాయి అని జన సేన పార్టీ ఆరోపణలు చేస్తోంది. అయితే ఎన్నికల సంఘం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి ఆదేశాలను జారీ చేయాలంటూ జన సేన పార్టీ కి చెందిన శ్రీనివాస రావు హై కోర్ట్ ను ఆశ్రయించారు. అయితే దీని పై తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు ను రిజర్వ్ లో ఉంచింది. గతేడాది బలవంతపు ఉపసంహరణ లు, బెదిరింపులు జరిగాయి అంటూ జన సేన పార్టీ పలు మార్లు వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే.