బిగ్ న్యూస్: సుధాకర్ ఘటన పై హైకోర్టు కీలక నిర్ణయం… సీబీఐ విచారణ కు ఆదేశం!!

Friday, May 22nd, 2020, 03:35:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి నీ అరికట్టడానికి వైద్యులకు, వైద్య సిబ్బంది కి పెర్సనల్ ప్రొటెక్షన్ కిట్ లు సరిగ్గా పంపిణీ జరగడం లేదు అంటూ డాక్టర్ సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో మత్తు వైద్యుడు అయిన డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి విషయంలో టిడిపి మహిళ అధ్యక్షురాలు అనిత హైకోర్ట్ కి లేఖ రాయడం తో ఇది కాస్త రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. అయితే దీని పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసిన పోలీసుల పై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే దీనికి సంబంధించిన నివేదికను 8 వారాల్లో న్యాయస్థానానికి అప్పగించాలని సీబీఐ కి తెలిపింది. అయితే ఈ ఘటన విషయం లో సుధాకర్ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా కుమారుడు కి న్యాయం జరగాలని కోరుకున్నారు. పరువు కాపాడుకోవాలంటే హైకోర్టు మాకు దిక్కు అని వ్యాఖ్యానించారు. అంతేకాక సీబీఐ విచారణ తో మాకు న్యాయ స్థానం పై నమ్మకం ఉంది అని అన్నారు. అంతేకాక ఈ ఘటన పై అధికారులు ఎవరూ కూడా స్పందించడం లేదు అని అన్నారు.