డాక్టర్ రమేష్ పై చర్యలు నిలిపివేయండి…రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం!

Tuesday, August 25th, 2020, 05:08:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్వర్ణ పాలేస్ లో డాక్టర్ రమేష్ కొవిడ్ కేరు సెంటర్ ను నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం అక్కడ ఒక భారీ అగ్ని ప్రమాదం జరగడం తో 10 మంది ప్రాణాలను కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాల పాలు అయ్యారు.అయితే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, యాజమాన్యం నిర్లక్షం కారణం అని తెలిపి, వారి అనుమతి ను రద్దు చేయడం మాత్రమే కాకుండా, వారి పై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది.

అయితే ఈ వ్యవహారం లో డాక్టర్ రమేష్, యాజమాన్యం హైకోర్టు ను ఆశ్రయించగా తాజాగా తీర్పు ను వెలువరించింది. తదుపరి చర్యలు నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఈ ప్రమాద ఘటన లో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం లో వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు తీరు ను విమర్శిస్తూ తప్పు బడుతున్నారు.