బిగ్ న్యూస్: నిమ్మగడ్డ కి షాక్…ఎస్ఈసీ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు..!

Sunday, February 7th, 2021, 06:30:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ను ఇంటికే పరిమితం చేసేలా డీజీపీ ను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం ను మంత్రి సవాల్ చేస్తూ హైకోర్టు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

అయితే నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు ఏక పక్షంగా ఉన్నాయి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అని, వివరాలు తీసుకోకుండా ఇంటికే పరిమితం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని, రాష్ట్రపతి తిరుమల కి వస్తున్నారు అని, ప్రోటోకాల్ అనుసరించి ఆహ్వానించాల్సిన బాధ్యత తనపై ఉంది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఉత్తర్వుల అమలు ను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ సూచించారు. అయితే ఎస్ ఈ సి తరపు న్యాయవాది కోర్టు లో వాదించారు. రాష్ట్రపతి ను ఆహ్వనించెందుకు అభ్యంతరం లేదు అని అన్నారు, మీడియా తో మంత్రి మాట్లాడవద్దు అనే ఆదేశాలను సమర్ధించింది హైకోర్టు. కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికే పరిమితం అయి ఉండాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది హైకోర్టు.