కోర్టులు, జడ్జీలను అవమానించేలా వ్యాఖ్యలు.. వైసీపీ ఎమ్మెల్యేకు చిక్కులు..!

Friday, August 7th, 2020, 09:44:06 PM IST


వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పండుల రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది వీ.వీ. లక్ష్మీనారాయణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసేలా పండుల చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు.

అయితే ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించడంతో తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జ్యుడీషియరీగానీ, చంద్రబాబుగానీ, జడ్జీలుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవని పరుష వ్యాఖ్యలు చేశాడు.