ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి జైలు శిక్ష.. హైకోర్టు కీలక తీర్పు..!

Friday, January 1st, 2021, 01:54:00 AM IST

High_court

ఏపీ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోర్టు దిక్కరణ కేసుకు పాల్పడిన కేసులో హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో విఫలమయ్యారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయం ముగిసే వరకు బాలకృష్ణమాచార్యులు న్యాయస్థానంలో కూర్చువాలని, అలాగే రూ.1000 జరిమానాను కూడా విధిస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది.

అయితే జరిమానా చెల్లించని పక్షంలో వారం రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే నిన్న మిషన్‌ బిల్డ్ ఏపీ కేసుపై కూడా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్ అధికారి ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున తప్పుడు అఫిడవిట్ సమర్పించడంపై మండిపడుతూ కోర్టు ధిక్కారం కింద ప్రవీణ్‌‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని సూచించింది.