ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్ట్..!

Wednesday, March 10th, 2021, 01:47:40 AM IST

High_court
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, వార్డుల పునర్విభజన అంశంపై 40కి పైగా పిటిషన్లు దాఖలు కావడంతో ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై నిన్న సింగిల్‌ బెంచ్‌ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్ట్ సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టేసింది. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలను నిర్వహించాలని కానీ ఫలితాలను మాత్రం వెల్లడించవద్దంటూ ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని సూచించింది. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉతర్వులు జారీ చేసింది.